#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

అంబేద్కర్ రూపంలో భారత రాజ్యాంగాన్ని మనం వరంగా భావించాలన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి

భారత రాజ్యాంగము దేశ ప్రజలకు అంబేద్కర్ అందించిన గొప్పవరమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తామని ప్రమాణం చేశారు.అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకూ ర్యాలీని ఎమ్మెల్యే గళ్లా మాధవి జెండా ఊపి ప్రారంభించి,ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి యస్సీ సెల్ నేతలు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాల్లర్పించారు.

అంబేద్కర్ రూపంలో భారత రాజ్యాంగాన్ని మనం వరంగా భావించాలన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి

25-11-2024 | ePaper | Bharatha Vanitha TV