#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం..
ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత వరకు సహకారం అందిస్తాం..
పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో ఆదివారం రాత్రి గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరామర్శించి.. వారికి భరోసా కల్పించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులతో కలిసి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేసిన మంత్రి..