అమరేశ్వరస్వామి ని దర్శించుకున్న భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్
సుప్రసిద్ధ,శైవ క్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, పంచారామాలలో ఒకటైన పల్నాడు జిల్లాలోని అమరావతి అమరేశ్వర ఆలయంలో వేంచేసియున్న శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామివార్లను కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్. ముందుగా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన స్థానిక వేద పండితులు. భారత మాజీ రాష్ట్రపతి, అమరావతి రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు, నిర్వహించిన పోలీస్ ఉన్నత అధికారులు. ఈ కార్యక్రమంలో ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసులు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి కోట ఆంజనేయులు, ఆలయ ఈఓ సునీల్ , స్థానిక వేద పండితులు తదితరులు పాల్గొన్నారు