#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఆటో డ్రైవర్ పోగొట్టుకున్న 47,000/- బాధితుడికి అప్పగించిన పోలీసులు

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు పోగొట్టుకున్న 47,000/-
నగదును వెతికి – కనిపెట్టి, రెండు రోజుల్లో మంగళగిరి రూరల్ పోలీసులు బాధితునికి అప్పగించారు. ఈనెల 18న మంగళగిరి హైవేపై హల్చల్ చేసి ట్రాఫిక్ జామ్ చేసిన అఘోరాని చూడటానికి ఆటో డ్రైవర్ కిందకి దిగారు. ఆ సమయంలో తన ప్యాంటు జేబులో పెట్టుకున్న రూ.47,000/- నగదును బాడుగ ఆటో డ్రైవర్
పోగొట్టుకున్నాడు. తాను పోగొట్టుకున్న నగదు తన ఓనర్ ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం ఇచ్చాడని పోలీసుల ముందు వాపోయ్యాడు. ఆటో నడిపితేనే రోజు గడుస్తుందని అటువంటిది అంత నగదు(రూ.47,000/-) ఎలా తీసుకురావాలో అర్ధం కావడం లేదని మంగళగిరి రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లుకి తన బాధను వివరించాడు. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు పర్యవేక్ష