ఈనెల 13న “రైతన్నకు అండగా వైఎస్ఆర్సిపి
గుడివాడ11; రాష్ట్రంలో నష్టపోతున్న రైతన్నలకు అండగా నిలుస్తూ, వారిని ఆదుకోవాలన్న నినాదంతో ఈనెల 13న నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుడివాడ వైఎస్ఆర్సిపి నాయకులు తెలియజేశారు.
వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరగనున్న “రైతన్నకు అండగా వైఎస్ఆర్సిపి”నిరసన కార్యక్రమ ప్రచార కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి వైసిపి జిల్లా అధికార ప్రతినిధి ఎం.వీ.నారాయణరెడ్డి స్థానిక భయ్యా వారి వీధిలోని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు.