ఈ నెల 29న జీవీఎంసీ బడ్జెట్ సమావేశం

ఏపీలోని మహా విశాఖ నగర పాలకసంస్థ 2025-26 బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించనున్నట్టు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4,554.27 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు ముసాయిదా బడ్జెట్ రూపొందించింది. 29వ తేదీ నాటికి కొత్త కమిషనర్‌ను నియమిస్తే ఆయన ఆధ్వర్యంలోనే బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఎవరినీ నియమించకపోతే ఇన్చార్జి కమిషనర్ హోదాలో జిల్లా కలెక్టర్ హాజరవుతారు