ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
అందరికీ నమస్కారం.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ది.12-12-2024న గురువారం సాయంత్రం 4 గంటలకు మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో దత్త కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారితో పాటు కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీమంత్రి వర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) గారు కూడా పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ క్లస్టర్ పార్టీ ఇన్చార్జిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇంఛార్జిలు, బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘాల నాయకులు, మైలవరం నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన.
ధన్యవాదములు.
ఇట్లు,
శాసనసభ్యుని వారి కార్యాలయం,
మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా