కదల లేకున్నా.. స్ట్రెచర్‌పై వచ్చి పరీక్ష రాసిన విద్యార్థిని

విధి వెంటాడినా.. ఓ విద్యార్థిని మాత్రం పట్టు వదలకుండా పదోతరగతి పరీక్షలు రాస్తోంది.
సత్యసాయి జిల్లాకు చెందిన తనూజ అనే విద్యార్థిని లేపాక్షి కస్తూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది.
ఇటీవల విద్యార్థిని విద్యాలయంలో మెట్లపై జారి కిందపడింది.
ఎడమ చేతికి, వెనక వైపు ఎముకలకు దెబ్బలు తగలగా.. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను హిందూపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు ఒక నెల విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.
పరీక్షలు రాస్తానని విద్యార్థిని పట్టుబట్టడంతో అంబులెన్స్‌లోనే ఆమెను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు.