#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

కార్యకర్తలను పరామర్శించిన దేవినేని అవినాష్

నందిగామ సబ్ జైల్ లో పెండ్యాల గ్రామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంచార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చిన్నా.

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన నాయకులు.
దేవినేని అవినాష్ గారు మాట్లాడుతూ పెండ్యాల గ్రామం లో జరిగిన చిన్న ఘర్షణలను అడ్డుకున్నందుకు తెదేపా నాయకులు దాడిచేసి ఘర్షణలలో లేని చదువుకునే పిల్లల పై కూడ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారాని అన్నారు.
పోలీస్ లు సైతం అధికార పార్టీ అజెండా ను మాత్రమే అమలుచేస్తున్నారని పేర్కొన్నారు.
వాస్తవంగా బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు అలాకాకుండా దాడికి పాల్పడిన అధికారపార్టీ నాయకులు చెప్పిన విధంగా నే నడుచుకుంటున్నారు అని అన్నారు.