కురగంటి వారి కండ్రిక దాసాంజనేయ స్వామి ఆలయం లో ఘనంగా కోటి దీపోత్సవం
ఎన్టీఆర్ జిల్ల నందిగామ మండలం కురగంటి వారి కండ్రిక గ్రామంలో వేంచేసి ఉన్న దాసాంజనేయ స్వామి వారి దేవాలయం లో కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. లింగాకారం లో భక్తులు దీపాలు వెలిగించారు. దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలతో, ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కొలువై ఉన్న ప్రాచీన దాసాంజనేయ స్వామి మహిమ గల వాడని,కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు, సిటీ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు