కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియా
దేష్ కి ప్రకృతి పరీక్ష న్ అభియాన్ అనే ఆయుర్వేద యాప్ను దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభించడమైనది. జిల్లా ప్రధాన కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ .K.V.S. సత్యనారాయణ ఈ ప్రత్యేక ఆయుర్వేద యాప్ను మంగళవారం రోజు నందిగామ డివిజినల్ ఆయుర్వేద వైద్యశాల నందు ఘనంగా ప్రారంభించారు. ఆయుర్వేదం ప్రకారం, ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ప్రత్యేకమైనది, కావున ఈ యాప్ ప్రతివ్యక్తి శరీర ధర్మస్వభావాన్ని (వాత, పిత్త, కఫ) గుర్తించి, ఆ వివరాల ఆధారంగా, ఆరోగ్య స్థితిగతులను మరియు జీవనశైలి విధానాన్ని పొందుపరుస్తుంది.
ముఖ్యంగా ఈ యాప్ మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆసక్తి మరియు ప్రోత్సాహంతో రూపొందించబడినది. ఆయుర్వేదం ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇది మరింత ఆసక్తి కలిగించేలా ప్రాధాన్యతను పొందింది.