#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి అని అన్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి అని అన్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కోరారు.నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు,కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే ప్రతి కార్యకర్తకూ ధైర్యం,భరోసా ఉంటుందన్నారు.బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ఆవిర్భవించిన టీడీపీ.. అన్న ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని చెప్పారు.సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఒక పక్క పార్టీ బలోపేతం కావటంతో పాటు మరో పక్క రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు.టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఇక నుంచి రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ లభిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్స్,క్లస్టర్,యూనిట్ పట్టణం నాయకులు పాల్గొన్నారు.