నరసరావుపేట పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ

నరసరావుపేట పట్టణంలో శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు స్థానిక 25 వ వార్డు పెద్దచెరువు లో పర్యటించారు సైడ్ కాలువలలో పూడికను తీశారు సైడ్ కాలువల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డిని తొలగించారు స్థానికులతో వార్డు లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్టంలో మరియు నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమలను వివరించారు సమస్యల పరిష్కారనికి అధికారులతో చర్చించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా”చదలవాడ మాట్లాడుతూ నరసరావుపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడమే తన లక్ష్యమని ప్రతి రోజు వార్డు వార్డు నా తిరుగుతూ మున్సిపాల్ కార్మికులను పార్టీ కార్యకర్తలను వెంట తీసుకొని కాలువలను రోడ్లను మరియు ప్రజల సమస్యలను పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపడ్తున్నట్టు తెలియజేసారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు