నరసరావుపేట మరియు రొంపిచర్ల మండలాలలో రేపు జరగబోయే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పూర్తి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీస్ వారిదే – మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు

నరసరావుపేట మరియు రొంపిచర్ల మండలాల లోని ఖాళీ అయిన స్థానాల కు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది .
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారు ,వారికి మెజార్టీ లేకపోయినా దౌర్జన్యంతో ఈ స్థానాలని గెలవాలని చూస్తున్నారనీ ,నరసరావుపేట మండలంలో 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు, ఒకరు చనిపోయినందున వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వచ్చింది, మిగిలిన 16 మంది లో ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలవలేదనీ,మా పార్టీలో గెలిచిన ఒక ఎంపీటీసీ అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో చేరినందున అప్పుడు తెలుగుదేశం పార్టీ వారికి ఒక్క ఎంపీటీసీ స్థానం ఉందని, ఆ ఒక్క ఎంపిటిసి స్థానంతో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఎలా గెలవాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు?
పోలీసులను అడ్డం పెట్టుకొని ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమం ,వారిని తీసుకెళ్లి రెండు నుంచి మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్లను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారని