పాపం : కడుపులో కత్తెర మర్చిపోయారు

హైదరాబాద్:మార్చి 29
లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.
సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న 17 సంవత్సరాల తర్వాత ఒక మహిళ కడుపులో శస్త్రచికిత్స కత్తెర బయటపడింది, సంధ్య పాండే అనే మహిళ ఫిబ్రవరి 28, 2008న ‘షీ మెడికల్ కేర్’ నర్సింగ్ హోమ్‌లో సి-సెక్షన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది.
ఆమె భర్త అరవింద్ కుమార్ పాండే పోలీసు ఫిర్యాదు ప్రకారం.. శస్త్రచికిత్స జరిగినప్పటి నుండి ఆమెకు నిరంతర కడుపు నొప్పి తో బాధపడు తుంది,వివిధ వైద్యులతో అనేక సంప్రదింపులు జరిపినప్పటికీ, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు.
ఇటీవల లక్నో మెడికల్ కాలేజీలో ప్రత్యేక వైద్య మూల్యాంకనం సందర్భంగా సంధ్య పాండేకు ఎక్స్-రే తీయించినప్పుడు ఈ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఎక్స్-రేలో ఆమె పొత్తికడుపులో కత్తెర ఉన్నట్లు వెల్లడైంది