పేదరిక నిర్మూలనే ఎజెండాగా విజన్-2047 ఆవిష్కరణ. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
దరిక నిర్మూలనే ఎజెండాగా విజన్-2047 ఆవిష్కరణ. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
రాష్ట్రంలోని సహజ వనరులను వినియోగించుకుంటూ, రాష్ట్ర స్థితిగతులు పూర్తిగా మార్చేలా స్వర్ణాంధ్రప్రదేశ్-2047 పేరుతో 10 సూత్రాల ప్రణాళికను టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేసారు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంతానికీ ప్రయోజనం కలిగేలా.. సహజ వనరులను అభివృద్ధికి ఉపయోగించుకునేలా ఈ దశ సూత్రాలను రూపొందించారన్నారు. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించిన విజన్-2047లో.. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన ప్రధాన ఎజెండాగా ఉన్నాయన్నారు. నైపుణ్యం గల మానవ వనరుల అభివృద్ధి, ప్రపంచస్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, డీప్‌టెక్ పరిజ్ఞానానికి పెద్ద పీట వేశారని వివరించారు.