#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
రాష్ట్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ర్యాంకింగ్ లో కడప జిల్లాకు రెండో స్థానం
గ్రామ స్థాయిలో వైద్యారోగ్య శాఖలో వైద్యాధికారులు,అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ.. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో… ఆరోగ్యశ్రీ, అనుబంధ ఆస్పత్రుల ప్రభుత్వ, వైద్యులు ,పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆరోగ్య సూచికలు, వైద్య శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని.. వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు