#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

రెవిన్యూ అధికారులను అడ్డుకున్న అక్రమ మైనింగ్ దారులు

పల్నాడు జిల్లా,పెదకూరపాడు నియోజకవర్గం,బెల్లంకొండ మండలం పాపాయి పాలెం గ్రామంలో యరగాని నాగమ్మ చెందిన సర్వేనెంబర్ 334/1బి2 లో  3.00 ఎకరాల భూమి పూర్వీకుల నుండి సంక్రమించినది.యరగాని నాగమ్మ పేరు మీద పాస్ పుస్తకాలు,1బి అడంగల్, సర్వే సర్టిఫికెట్, భూమిశిస్తూ కొన్ని ఏండ్ల నుండి కడుతున్నట్లు రసీదులు ఉన్నాయి. యరగాని నాగమ్మ తమ్ముడు యడవల్లి శ్రీనివాసరావు ఈ భూమిని మైనింగ్ లీజు కోసం అప్లై చేసుకోవడం జరిగింది.ఈ భూమికి ప్రక్కన సర్వేనెంబర్ 338/7-1 ప్రభుత్వ భూమిని గుదే లక్ష్మణ్ బాబు మైనింగ్ లీజుకు తీసుకోవడం జరిగింది.లక్ష్మణ్ ఈ భూమిని గుంటూరుకు చెందిన అర్తిమళ్ళ శ్రీనివాస్ కు సబ్ లీజ్ కు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో అర్తిమళ్ళ శ్రీనివాస్ ప్రక్కన ఉన్న యరగాని నాగమ్మ చెందిన భూమిలో రాత్రిపూట అక్రమంగా, దౌర్జన్యంగా మైనింగ్ చేస్తున్నాడు. ఇదేమిటి అని ప్రశ్నించగా నేను అధికార పార్టీకి చెందిన నాయకుడును,మీరు నన్ను ఏమిచెయలేరు,మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అడ్డొస్తే చంపటానికి కూడా వెనుకాడమని అర్తిమళ్ళ శ్రీనివాస్ కుమారుడు చంద్రబాబు  హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈక్రమంలో యరగాని నాగమ్మ తమ్ముడు యడవల్లి శ్రీనివాసరావుకు అర్తిమళ్ళ  శ్రీనివాస్ ఫోన్ చేసి మీ భూమి కూడా నాకు లీజుకి ఇవ్వాలి, లేకపోతే మీ అంతు చూస్తానని,ఈ ఏరియాకు ఎవరు కూడా రావటానికి వీలు లేదని, నేను తప్ప ఎక్కడ ఎవరు కూడా ఈ ప్రాంతంలో మైనింగ్ చేయటానికి వీలులేదని, నేను చెప్పినట్టు వినకపోతే మీ భూమి కూడా మీకు లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.అర్తిమళ్ల  శ్రీనివాసు మరియు చంద్రబాబు  నుండి తమకు ప్రాణహాని ఉందని యరగాని నాగమ్మ,యడవల్లి శ్రీనివాసరావు మీడియా ముందు తమ గోడు వినిపించుకున్నారు. కావున సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని, బీసీ వర్గానికి చెందిన నాగమ్మ కు తగిన న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.