వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ను చూడాల్సిన బాధ్యత పిల్లలదే
ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఇచ్చిన ఫిర్యాదు కు సంబంధించి స్వయంగా వెళ్లి విచారణ చేపట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. 18వ తేదీ సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఎడ్లపాడు గ్రామానికి చెందిన ఎడ్లూరి వెంకట్రావు అను వ్యక్తి పల్నాడు జిల్లా ఎస్పీకి తన ఒక్కగానొక్క కుమారుడు అయిన నాగరాజు ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని గొడవ పడుతూ తన ఆస్తి కాజేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి బుధవారం పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ స్వయంగా వెళ్లి విచారించగా తండ్రి కొడుకుల మధ్య సుమారు పది సంవత్సరాల నుండి గొడవలు జరుగుతూ 2022 వ సంవత్సరంలో సీనియర్ సిటిజన్ ఆక్ట్ కింద ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ నందు వెంకట్రావు కొడుకు అయిన నాగరాజు మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయినా నాగరాజు అతని పద్ధతి మార్చుకోలేదు. దీంతో ఎస్పీ స్వయంగా వెళ్లి తండ్రి కొడుకులతో మాట్లాడి సయోధ్య కుదర్చడం జరిగింది