వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్..
అమరావతి: నీటిపారుదల ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పోలవరం విధ్వంసం సహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వీర్యంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ నీటిపారుదల ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం, చిత్తూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ఆయన ధ్వజమెత్తారు.