శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట పట్టణంలోని 34 వార్డ్ బీసీ కాలనీలో జరిగిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు,మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే కాలువలో పూడిక తీశారు.పట్టణంలో ప్రతిరోజు పలు వార్డులలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు