సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల నివారణ అవగాహన కార్యక్రమం
సైబర్ క్రైమ్, మత్తు పదార్ధాలు మరియు డ్రగ్స్,మత్తు పదార్థాల నివారణ అవగాహన కార్యక్రమం
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నరసరావు పేట సబ్ డివిజన్ డియస్పి నాగేశ్వర రావు పర్యవేక్షణలో చిలకలూరి పేట నందు సైబర్ క్రైమ్, మత్తు పదార్ధాలు మరియు డ్రగ్స్,మత్తు పదార్థాల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించినారు
ఈ సందర్భంగా చిలకలూరి పేట నందు శ్రీ చైతన్య స్కూల్ నందు చిలకలూరి పేట టౌన్ సిఐ రమేష్ విద్యార్థులకు అవగాహన కలిపించారు.
ఇటీవల కాలంలో మన దైనందిన జీవితంలో ఇంటర్నెట్, స్మార్ట్ మొబైల్, కంప్యూటర్ ఒక భాగం అయిపోయాయి. ఇవి లేకుండా మనకు ఒక రోజు గడవటం కష్టంగా ఉంది. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను సులభంగా బురిడీ కొట్టించి ఆర్థికంగా దోచుకుంటూ మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ర్యాలీ శ్రీ చైతన్య స్కూల్ నుండి NRT సెంటర్ వరకు సాగింది.