అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం: చీఫ్ విప్ జీవీ
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ, మక్కెన
రాష్ట్రంలో పేదలు, అవసరంలో ఉన్న వారు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని తెలిపారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్, విను కొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు. 2014-19 మధ్య గానీ, ఇప్పుడు గానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న 47మంది లబ్ధిదారులకు రూ.92 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన వారందరికి మంజూరు పత్రాలను అందించారు.