#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

(అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ).

ప్రజలు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలకు రాకుండా మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో, మున్సిపాల్టీ స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలోనే ప్రాధమికంగా ఆర్జీలు అందించేలా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ , అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాధ్ తో కలసి అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మ్మీ మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ డివిజన్, మున్సిపాల్టీలలో, మండల కేంద్రాలలో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ సంబంధిత శాఖల అధికారులతో సక్రమంగా ప్రజలు అందించిన అర్జీలను ఆన్ లైన్ చేసి సక్రమంగా పరిష్కరించాలన్నారు.