ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో శాసనసభ్యులు కృష్ణప్రసాద్ సమీక్ష సమావే
తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. గ్రామీణ నీటి సరఫరా విభాగం మరియు పారిశుద్ధ్య నిర్వహణ శాఖ (ఆర్.డబ్ల్యూ.ఎస్ అండ్ శానిటేషన్) అధికారులతో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఈ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఫ్లోరైడ్ రహిత స్వచ్ఛమైన కృష్ణాజలాలను మారుమూల గ్రామాలకు సైతం సవ్యంగా సరఫరా చేయాలని ఆదేశించారు. గొల్లపూడికి తాగునీటిని సరఫరా చేసే పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కవులూరు, కట్టుబడిపాలెం, పైడూరుపాడు గ్రామాలకు తాగునీటి పంపిణీని మెరుగుపరచాలని ఆదేశించారు. ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.