#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఎంపీ అవినాష్‌కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 19: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి (YSRCP MP Avinash Reddy) సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.