#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలు

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలు
• ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్ గా ఉంటుంది
• కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ని కోరిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్.
ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ కి తెలియచేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం శ్రీ భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు.