ఏపీలో ‘EPC మోడల్’లో మెట్రో రైల్ ప్రాజెక్టుల పనులు

ఏపీలో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులను ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (EPC) మోడల్లో చేపట్టాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రాజెక్టు డిజైన్ల తయారీకి ఇంటరిమ్ కన్సల్టెంట్ల కోసం రూ.20 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, గుజరాత్, చెన్నై మెట్రో ప్రాజెక్టుల్లో అనుభవం ఉన్న విశ్రాంత అధికారుల సేవలు వినియోగించుకోవాలని తీర్మానించింది.