#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఏపీ లో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ‘సిట్’ ఏర్పాటు..

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను సిట్ అధిపతిగా నియమించింది.

ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు