గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు సోదరభావం పెంపుతో పాటు మతసామరస్యానికి ప్రతీక అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు 39వ డివిజన్ మారుతి నగర్ లో కొండబోయిన శ్రీను ఆధ్వర్యంలో మరియు గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిధిగా హాజరయ్యి ముస్లిం సోదర,సోదరిమణులతో కలిసి దీక్ష విరమణ మరియు నమాజ్ లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదర, సోదరిమణులకు ఎమ్మెల్యే స్వయంగా ఇఫ్తార్ విందును వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లాహ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా క్రమ శిక్షణ ఏర్పడుతుందన్నారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు