#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల వెరిఫికేషన్ కార్యక్రమం

గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల వెరిఫికేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా బొమ్ములూరులో జరుగుతున్న పెన్షన్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతూ పింఛన్ల వెరిఫికేషన్ నిర్వహించారు. గ్రామంలోని మొత్తం 468 పింఛన్ లబ్ధిదారులు ఉండగా 12 టీంలుగా ఏర్పడిన ప్రభుత్వ ఉద్యోగుల బృందం వెరిఫికేషన్ లో పాల్గొన్నాయి. మండల స్థాయి అధికారితో కూడిన ఇద్దరు టీం సభ్యులకు 40 మంది పింఛనర్లను కేటాయిస్తూ.. ప్రభుత్వం సూచించిన అంశాల మేరకు అధికార యంత్రాంగం వెరిఫికేషన్ నిర్వహిస్తుంది.రెండు రోజులపాటు వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందని బొమ్ములూరు సచివాలయ మండల పరిషత్ వర్గాలు తెలిపాయి