చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ విప్ పదవి అదృష్టమని జేకేసీ కళాశాలలో నూతన ఆడిటోరియం ప్రారంభ సభలో పేర్కొన్న జీవి ఆంజనేయులు
కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీలో చీఫ్ విప్‌గా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని వినుకొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం గుంటూరు జేకేసీ కళాశాలలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జాగర్లమూడి లక్ష్మయ్య చౌదరి పేరుతో ఆడిటోరియాన్ని నిర్మించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జీవీ మాట్లాడుతూ ఎంతోమంది నాయకులు , ఉన్నతాధికారులు, వివిధ హోదాల్లో స్థిరపడిన ప్రముఖుల కార్ఖానా ఉన్న గుంటూరు జేకేసీ కళా శాల పేరు మరింత పెంచేలా చీఫ్ విప్ హోదాలో సమర్థంగా పనిచేస్తానని తెలిపారు. జేకేసీ కళాశాలలో సుమారు రూ.2.50 కోట్లకుపైగా నిధులతో ఇంత చక్కటి ఆడిటోరియం నిర్మించడం అభినందనీయమన్నారు. జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మాదల శ్రీనివాసు, చుక్కపల్లి రమేష్, చంద్రమౌళి విలువైన సమయం వెచ్చించి అద్భుతంగా చేశారని కొనియాడారు.