చారిత్రాత్మక భద్రకాళి చెరువుకు గండి.. వందల ఎకరాల విస్తీర్ణం గల చెరువు నీరంతా ఏం చేస్తారు..?
చారిత్రాత్మక భారీ సరస్సు పక్షాళన సాధ్యమేనా..? ఓరుగల్లులో అతిపెద్ద ఆ జలాశయాన్ని ఎందుకు పూర్తి శుద్ధికి శ్రీకారం చుట్టారు.
భద్రకాళి చెరువుకు గండెందుకో తెలుసా..?
వరంగల్ లోని భద్రకాళి చెరువుకు ఎట్టకేలకు నీటి పారుదల శాఖ అధికారుల గండికొట్టారు.. ఆ నీరంతా దిగువకు వృథాగా విదిలేస్తున్నారు. అ చారిత్రాత్మక భారీ సరస్సు పక్షాళన సాధ్యమేనా..? ఓరుగల్లులో అతిపెద్ద ఆ జలాశయాన్ని ఎందుకు పూర్తి శుద్ధికి శ్రీకారం చుట్టారు..? ఆ నీరంతా ఎక్కడికి మళ్లిస్తారు..? అసలు చెరువుకు గండి కొట్టాలన్న సర్కార్ ఆలోచన ఏంటో తెసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
ఒకప్పుడు ఓరుగల్లు ప్రజల దాహార్తిని తీర్చిన భద్రకాళి చెరువు ఇప్పుడు నీటి స్టోరేజీ జలాశయంగా మారింది.. చుట్టూ కొండలు, ఒకవైపు భద్రకాళి అమ్మవారి దేవాలయం మరోవైపు ట్యాంక్ బండ్ సుందర దృశ్యాలు ఈ ప్రాంతంలో కనువిందు చేస్తాయి. 560 ఎకరాల విస్తర్ణంలో సువిశాలంగా ఉండే ఈ జలాశయం ప్రస్తుతం 382 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే మిగిలి ఉంది. సుమారు రెండు వందల ఎకరాల మేర ఆక్రమణలకు గురైంది.. మిగిలిన చెరువును పూర్తి స్థాయిలో పరిరక్షించి, ఇందులో పూడిక తీత , గుర్రపుడెక్క తొలగించి, నీటి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా మురికి నీరు కలువకుండా డైవర్ట్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.. అందులో భాగంగానే భద్రకాళి చెరువు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం
భద్రకాళి చెరువు పూర్తి సామర్థ్యం 150 మెట్రిక్ క్యూబిక్ ఫీట్స్ సహజంగా 132 మెట్రిక్ క్యూబిక్ ఫీట్స్ లకు నీరు చేరితే మత్తడి దుంకుతుంది. ఎగువన జూ పార్క్ నుండి వచ్చే మురికినీటి కాలువ, సిఎస్ఆర్ గార్డెన్ నుండి వచ్చే మరో మురికి నీటి కాలువ, బొందివాగు నాలా, శాయంపేట సర్కిల్ ప్రాంతంలోని నీరంతా ఈ చెరువులోనే కలుస్తుంది..
ఈ రోజు నుండి పదిహేను రోజుల పాటు చెరువులోని నీరంతా దిగువకు వదిలేయనున్నారు. కాపువాడ ప్రాంతంలోని మత్తడి ప్రాంతంలో చెరువుకు గండి కొట్టారు అధికారులు. రోజుకు 500 క్యూసెక్ ల నీటి చొప్పున 15 రోజుల వ్యవధిలో చెరువు ఖాళీ చేసి నీరంతా దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ నీటిని దిగువన ముచ్చర్ల నాగరం చెరువుకు మల్లిస్తారు. ఆ చెరువు నిండిన తర్వాత చలి వాగు ద్వారా దిగువకు వదిలేస్తారు. అయితే చెరువుకు గండి కొట్టి నీటిని దిగువకు వదిలే సమయంలో దిగువన ఎలాంటి ముంపు ముప్పు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా అలర్ట్ చేశారు.
చెరువు ఖాళీ చేయడం వరకు ఓకే.. మరి ఇందులో పూడిక తీసిన మట్టిని ఏం చేయాలి..? ఏం చేస్తారు..? ఎంత కేపాసిటీ మట్టి తీయాలి అనేది ఇప్పటివరకు అధికారుల వద్ద ఎలాంటి ముందస్తు ప్లానింగ్ లేదు. చెరువులో ఒక మీటర్ డెప్త్ తో ఒక లేయర్ మట్టి తొలగిస్తే ఇప్పుడున్న నీటి సామర్థ్యానికంటే అదనంగా 50 మెట్రిక్ క్యూబిక్ ఫీట్స్ పెరుగుతుందని భావిస్తున్నారు. తద్వారా భద్రకాళి చెరువు నీటి సామర్థ్యం 200 మెట్రిక్ క్యూబిక్ ఫీట్స్ లకు చేరుతుందని అంచనాలు వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…