#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాజకీయాలు తగదు

పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మహాత్మ జ్యోతిరావ్ పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమాన్ని మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, అంబెడ్కర్ విగ్రహాలను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ కోరారు. ఈ దేశంలో అంటరానితనం అస్పృశ్యత పై పోరాడిన యోధుడు మేధావి, పురుషులతో సమానంగా ఉన్న మహిళలకు విద్యా అవకాశాలు సమాన హక్కులు కావాలని పోరాడిన వ్యక్తి పూలే అని తన భార్య సావిత్రిబాయి పూలే కి విద్య నేర్పించి మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళ లకు విద్యా అవకాశాలు కల్పించిన మార్గదర్శకులు వారి జంటని అటువంటి మహానీయుల విగ్రహాలకు వర్ధంతి జయంతి కార్యక్రమాలలో పూలదండలకు పరిమిత మాత్రమే కాకుండా ప్రతి మండల కేంద్రంలో పూలే అంబేడ్కర్ గారి విగ్రహాలు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసే దిశగా అధికార ప్రతిపక్షాలు కృషి చేయాలి తప్ప ఆయన వర్ధంతి కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలకు జేజేలు కొడుతూ పూలే అంబేడ్కర్ వాదుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరించవద్దని హేతువు పలుకుతూ పల్నాడు ప్రాంతంలో బీసీ స్టడీ సర్కిల్ తో పాటు బీసీ భవన్ లో ఏర్పాటు చేయడమే కాక పూలే దారి ఆశయాలను తీసుకెళ్లే దిశగా తమ వంతు కృషి ఉండాలని సంఘాలుగా ఎవరు మేధావులు మనోభావాలు దెబ్బతీసిన ఒప్పుకునేది లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు నివాళులర్పించిన వారిలో మాల మహానాడు నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు ఉస్టేల జయరావు, పట్టణ కార్యదర్శి మెడబలిమి సాంబశివ, గేరపాటి మోహన్ రావు,గోదా నీలంబ్రం, కుంభ బ్రహ్మయ్య,తదితరులు పాల్గొన్నారు

జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాజకీయాలు తగదు

28-11-2024 | ePaper | Bharatha Vanitha TV