#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ప్రత్యేక ఓటరు జాబితాను రూపొందించాలన్న జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ కె.కన్నబాబు

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2024లో భాగంగా ప్రత్యేక ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ కె. కన్నబాబు (రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి) ఈఆర్వోలు, ఏఈఆర్వోలను ఆదేశించారు. కడప కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ లో శనివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2025 లో భాగంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ అదితి సింగ్ లతో కలిసి.. జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ కె.కన్నబాబు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ కన్నబాను మాట్లాడుతూ… ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల కమీషన్ ప్రక్రియ, నిబంధనలు అమలు చేయాలన్నారు. దేశంలో పెద్ద ఎత్తున జరిగే ఎన్నికల నిర్వహణలో చిన్న తప్పు జరగకుండా ఉండాలంటే ఎన్నికల కమీషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన వారిని నూతన ఓటర్లుగా నమోదులో వివరాలు.పక్కాగా నమోదు చేయాలన్నారు.