#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

భగ్గుమంటున్న భానుడు.. ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు..

ప్రస్తుత ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు 3,4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.. గతేడాదితో పోలిస్తే ఈసారి వేసవిలో ఎండలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు

ఫిబ్రవరి సగం నెల కూడా పూర్తి కాలేదు.. అప్పుడే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెలలో వచ్చే శివరాత్రితో చలి శివ శివా అనుకుంటూ వెళ్లిపోతుందని చెబుతారు.. కానీ, చలికాలం పూర్తవకుండానే ఎండలు మండిపోతున్నాయి.