మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు అందుగల సుశీల కు ఘన సన్మానం
యన్టీఆర్ జిల్ల నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు అందుగల సుశీల ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి సత్కరించింది. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మల్లెపాక శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. విజయలక్ష్మి లు, సుశీల ను దుశ్సాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కార్మికురాలు సుశీల గత రెండు దశాబ్దాలుగా మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు గా విద్యార్థీని విద్యార్థులకు రుచికరమైన బోజనం వండి పెట్టి పిల్లలు ఆకలి తీర్చిన మహనుబావురాలిని కొనియాడారు. భవిష్యత్తులో కూడా సుశీల పిల్లలకు మంచి రుచిగల, నాణ్యమైన బోజనం పెట్టాలని కోరారు. సుశీల సేవలు మరింత విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, సత్యవతి, శ్రీదర్ పలువురు ఉపాద్యాయులు, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు