ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తాము – ఎమ్మెల్యే గళ్ళ మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళ మాధవి హామీనిచ్చారు. మంగళవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. వాకర్స్,క్రీడాకారులను అడిగి స్టేడియంలో ఉన్న వసతులు,సమస్యల గురించి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆరా తీశారు. అనంతరం స్టేడియంలోనే వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాలుగా స్టేడియం సమస్యలు మరియు చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. స్టేడియంలో ప్రధానంగా వర్షాకాలంలో చినుకు పడితే ట్రాక్ మొత్తం చిత్తడిగా మారిపోతుందని దీనివలన వృద్ధులు మహిళలు,వృద్దులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లారు. అదేవిధంగా టెన్నిస్ కోర్టులో లైటింగ్ సమస్య ఉన్నదని, అదేవిధంగా టేబుల్ టెన్నిస్ 1 టేబుల్ మాత్రమే ఉన్నదని, దీనిని 6 టేబుల్స్ పెంచాలన్నారు. జిమ్ సెంటర్ లోని పరికరాలు పాతవిగా ఉన్నాయని, వీటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలని కోరారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ సరిగ్గా లేదని, ఆధునికరించాలని సభ్యులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఎమ్మెల్యే గళ్ళ మాధవి స్పందిస్తూ… ఎన్టీఆర్ స్టేడియం నియోజకవర్గానికి తలమానికం అని,అటువంటి స్టేడియంలో ఇన్ని సమస్యలు తిష్టవేయటం చూస్తుంటే చాలా బాధవేస్తున్నదని,ప్రతి రోజూ వందలాది మంది వాకర్స్, క్రీడాకారులు ఉండే చోట్ల సమస్యల నిలయంగా మారిపోయిందన్నారు.