రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా P. విజయకుమార్
రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ కుమార్ కు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. నిబద్ధతతో పని చేసి ఛైర్మన్ పదవికి వన్నె తేవాలని, మాల సమాజాన్ని ఆర్థిక స్వావలంబన వైపు నడిపించాలని కోరారు.