ప్రపంచ యవనికపై అన్ని రంగాలలో మన జిల్లా బిడ్డలు ప్రకాశించాలన్న
చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సెలబ్రేషన్స్/బంగారు బాల్యం బాలోత్సవాలు ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఒంగోలులోని ఓల్డ్ గుంటూరు రోడ్డులో గల రవి ప్రియా మాల్ వద్ద నుండి పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ ని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్.పి శ్రీ ఏ ఆర్ దామోదర్ జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్ధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ యవనికపై అన్ని రంగాలలో మన జిల్లా బిడ్డలు ప్రకాశించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆకాంక్షించారు. ఈ దిశగా ఆరోగ్య, సురక్షిత, సంతోషకరం, సాధికారతతో కూడిన బాల్యాన్ని మన జిల్లాలోని బాలలందరికీ ఇవ్వాలన్న లక్ష్యంతోనే “బంగారు బాల్యం” కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. వారం రోజులపాటు నిర్వహించిన బంగారు బాలోత్సవాలు ముగింపు సందర్భంగా పి.వి.ఆర్. బాలుర హైస్కూల్లో బుధవారం జరిగిన సభలో ప్రతి ఆడబిడ్డ కనీసం డిగ్రీ చదవాలన్నారు. జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.