నేచురల్ ఫార్మింగ్ లో ఏపి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో వుంది
ఏపి స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన రాబోయే కాలంలో ఈ కార్పొరేషన్ కి ప్రాధాన్యత చాలా పెరగునుంది. దేశంలోనే మన రాష్ట్రం నేచురల్ ఫార్మింగ్ లో మొదటి స్థానంలో వుంది. ఇతర రాష్ట్రాలకు సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయిలో రాష్ట్రంలో నేచురల్ ఫార్మింగ్ వుంది. ఈ కార్పొరేషన్ ఇచ్చే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్ మీదే మొత్తం ఆధారపడి వుంటుంది. అందుకే కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగిందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు