ఏపీఐఐసీ కాలనీలోని కామన్ స్థలం రెగ్యులైజేషన్ కి కృషి చేస్తాం
ఏపీఐఐసీ కాలనీలోని కామన్ స్థలం రెగ్యులైజేషన్ కి కృషి చేస్తాం అని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీ వాసుల కామన్ సైట్ రెగ్యులైజేషన్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పానబాక రచన తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ బుధవారం పర్యటించారు. ఏపీఐఐసీ కాలనీలోని ఎమ్.ఐ.జీ, ఎల్.ఐ.జి, ఈ.డబ్ల్యు.ఎస్ సెక్టార్స్ లోని సెట్ బ్యాక్ సమస్య ను వీరంతా స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీవాసుల కామన్ సైట్ రెగ్యులైజేషన్ సమస్య గురించి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మొదటి నుంచి కృషి చేస్తున్నారని చెప్పారు. 1976 సంవత్సరంలో ఈ కాలనీ నిర్మాణం చేశారని చెప్పారు. కాలనీలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే అంశంపై ఎమ్మెల్యే గద్దె రామమోహన్, తాను కాలనీలోని పెద్దలు గత కొన్ని రోజులుగా చర్చిస్తున్నామని చెప్పారు. ఆటోనగర్‌లోని చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు, పనిచేసే వారు స్థలాన్ని కొనుగోలు చేసి చిన్నపాటి ఇళ్ళను నిర్మాణం చేసుకున్నారు. స్థలంలో ఉన్న ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారే కాని కామన్ సైటును రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. ఈ సమస్యను తమ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరించి ఎ.పి.ఐ.ఐ.సి కాలనీ వాసులకు న్యాయం చేస్తుందన్నారు.