#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్ శీల నిర్వహణ

జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, డి ఎం అండ్ హెచ్ ఓ, పిహెచ్సి వైద్యాధికారులతో క్లస్టర్ల వారి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రతి పిహెచ్సి ని మ్యాప్ చేసి వాటిల్లో అందించాల్సిన వైద్య సదుపాయాలన్నీ రోగులకు అందేలా చూడాలన్నారు.
ఇమ్యునైజేషన్ నూరు శాతం జరుగుతోందని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి శిక్షణలు చాలా ముఖ్యం, కావున ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం గర్భవతుల ఎనీమియా రీడింగ్స్ కరెక్ట్ గా నమోదు చేయాలన్నారు. బయోమెడికల్ ఎక్విప్మెంట్స్ లేని చోట్ల వాటిని ఏర్పాటు చేయాలన్నారు. వైద్య పరికరాలు పనిచేసేలా చూడాలని, ఉన్న వాటిని వినియోగించాలని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీలు భర్తీ చేయుటకు చర్యలు తీసుకుని, రోగులకు వైద్య పరీక్షలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే పటిష్టవంతంగా నిర్వహించాలన్నారు. క్షయ, కుష్టు వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించరాదన్నారు. ప్రోగ్రాం అధికారులకు, పి హెచ్ సి వైద్యాధికారులకు అవసరమైన ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించాలన్నారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం సరిగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల లోపల పరిశుభ్రత, శానిటేషన్ తో పాటు పి హెచ్ సి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎదురు మొండి దీవులలో పిహెచ్సి వైద్యుల నివాస సదుపాయం కల్పించుటకు చర్యలు తీసుకోవాలన్నారు.