అక్రమ కేసులకు భయపడేది లేదు చట్టపరంగా పోరాడతాం
అక్రమ కేసులకు భయపడేది లేదు చట్టపరంగా పోరాడతాం – మాజీ MLA గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
ఈరోజు స్థానిక గుంటూరు రోడ్డు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….
తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకు నాపై అక్రమ కేసులు బనాయించారు.
ఎటువంటి సాక్షాలు లేకుండా అవాస్తవ ఆరోపణలతో ఒక మతిస్థిమితం లేని బ్లాక్ మైలర్ వ్యక్తి పెట్టిన ఆరోపణల మేరకు నాపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం అని అన్నారు