#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఆవుల నాని యాదవ్ మృతికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

జగ్గయ్యపేట మండలం, కే. అగ్రహారం గ్రామానికి చెందిన విద్యా కమిటీ చైర్మన్ & గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల నరసింహారావు (నాని) అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నాని భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. యువ నాయకులు శ్రీరాం చిన్న బాబు అంతిమయాత్రలో పాల్గొని పాడెమోసి నివాళులర్పించారు.

ఆవుల నాని యాదవ్ మృతికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

21-11-2024 | ePaper | Bharatha Vanitha TV