ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వం : సీఎం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగానికి మహర్దశన్న సీఎం చంద్రబాబు నాయుడు
* రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి మహర్దశ ప్రారంభమైంది. మహారత్నలో ఒక్కటైన ఎన్టీపీసీ సంస్థ తన ‘ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్’ ఆధ్వర్యాన ఈ రంగంలో భారీ పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) – ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) మధ్య ఒప్పందం జరిగింది. రాష్ట్రానికి ఈ ఒప్పందం అమలులోకి రావడం ద్వారా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రూ. 1,87,000 కోట్ల పెట్టుబడి ఎన్జీఈఎల్ పెట్టనుంది. దీని ద్వారా దాదాపు రాష్ట్రంలో 1,06,250 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే రానున్న 25 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.20,620 కోట్ల లబ్ది రాష్ట్రానికి వివిధ రూపాల్లో చేకూరనుంది. ఈ ఒప్పందం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ జాయింట్ వెంచర్ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామి చేసే క్రమంలో కీలక అడుగు అన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు