నందిగామ డివిజనల్ పశుసంవర్ధక శాఖ అధికారుల తో సమీక్షా
నందిగామ డివిజనల్ పశుసంవర్ధక శాఖ అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించిన
యన్టీఆర్ జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జె.డి., డాక్టర్.యం.,హనుమంతురావు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజనల్ పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకుల కార్యాలయం లో డిడి. డాక్టర్. మోసెస్ వెస్లి వారి ఆధ్వర్యంలో నందిగామ డివిజనల్ పరిధిలోని పశు సంవర్ధక శాఖ అధికారుల తో యన్టీఆర్ జిల్ల జె.డి., డాక్టర్. హనుమంతురావు సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా యన్టీఆర్ జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జె.డి., డాక్టర్.యం.,హనుమంతురావు మాట్లాడుతూ నిర్దేశించిన సమయానికి పశుగణన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాధి నిరోధక టీకాలను వేయడం కూడా నిర్దేశించిన సమయానికల్లా పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటి వరకు వ్యాధి నిరోధక టీకాలు, పశుగణన సరిగా చేయని అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేయాలని డిడి. హనుమంతురావు వారిని ఆదేశించారు. ఆ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సరిగా పని చేయ ని అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాడి రైతులు తమ పాడి పశువులకు సెక్స్ సార్టెడ్ సెమన్ ను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జె.డి., డాక్టర్.,యం., హనుమంతురావు, డిడి., డాక్టర్., మోసెస్ వెస్లి ,ఎడి.,లు డాక్టర్. కృష్ణమూర్తి, డాక్టర్., వెంగళరావు, డాక్టర్ ., హరిహరనాథ్ , డాక్టర్., వెంకటరావు, డాక్టర్., రాధాకృష్ణ , డాక్టర్., భవాని ప్రసాద్ ,వి.ఎ.యస్.లు., పారావెట్ లు,ఎ.హెచ్.ఎ.,లు, గోపాలమిత్ర లు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.