ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ కానిస్టేబుల్ కు డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎన్.టి.ఆర్ జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ కానిస్టేబుల్ కు , సచివాలయ మహిళా పోలీస్ వారికి డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నగర పోలీస్ కమీషనర్
ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణా కార్యక్రమం ను కమాండ్ కంట్రోల్ నందు ప్రారంభించడం జరిగింది. మహిళ కానిస్టేబుల్స్ 38 మందికి , సచివాలయ మహిళా పోలీస్ 38 మందికి మొత్తం 76 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ శ్రీ గౌతమీ శాలి ఐ.పి.ఎస్., గారు, క్రైమ్ డీసీపీ డా II తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్., పాల్గొన్నారు