#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం

రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం.
తేజస్వి పొడపాటి, చైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి
తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించడంలో తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ గా తేజస్వి పొడపాటి హరిత బెర్మ్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రొఫెషనల్స్ కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవచేయడానికి చాలా మంది ఆలోచిస్తున్నారన్నారు. అలా నాకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు

రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం

22-11-2024 | ePaper | Bharatha Vanitha TV