#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివనాథ్

ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివనాథ్
రోజ్‌ సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్‌ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డులోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన‌ ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం సంద‌ర్శించారు . ఎంపి కేశినేని శివ‌నాథ్ కు సంస్థ నిర్వాహ‌కులు స్వాగ‌తం ప‌లికారు. ఈ ఎగ్జిబిష‌న్ కు విచ్చేసిన సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ఒక మొక్క‌ను నాటారు.
అలాగే ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ల శాల‌లో వెస్ట్ మెటీరియ‌ల్ తో విద్యార్ధులు త‌యారు చేస్తున్న వ‌స్తువుల‌ను ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆస‌క్తి గా తిల‌కించారు. నేచుర‌ల్ ఫార్మింగ్ ప‌ద్ద‌తిలో పండించిన పూలు, పండ్లు, కూర‌గాయ‌ల స్టాల్స్ ను సందర్శించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.